Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీలో కేవలం గురువును మాత్రమే చూస్తున్నా.. అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు..

Advertiesment
murder
తన వద్దకు ట్యూషన్‌‍కు వచ్చిన యువతిపై మనసు పడిన గురువు (ఉపాధ్యాయుడు)కి ఓ విద్యార్థి తేరుకోలేని షాకిచ్చింది. మీలో కేవలం గురువును మాత్రమే చూస్తున్నా.. మరొకటి ఆలోచన చేయొద్దంటూ ధైర్యంగా బదులిచ్చింది. దీన్ని అవమానంగా భావించిన ఆ వ్యక్తి సుపారీ ఇచ్చిన ఆ యువతిని హత్య చేయించాడు. ఈ దారుణ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. కోడెర్మా జిల్లా దోమ్‌చాంచ్ ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
స్థానిక ప్రాంతానికి చెందిన దీపక్ సావ్ అనే వ్యక్తి వద్దకు ఓ యువతి వెళ్లేది. ఆమెకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన మహిళ.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించసాగాడు. కొన్నాళ్లుగా బాగానే చదువు చెప్పిన గురువు.. రోజులు గడిచే కొద్దీ ఆమెపై ప్రేమ పెంచుకున్నాడు. ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజున ఎవరూ లేని సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతిని కోరాడు. దీనికి ఆమె ఒకింత షాక్‌కు గురైంది. 
 
పదేపదే ఒత్తిడి చేయడంతో... మీలో కేవలం గురువును మాత్రమే చూస్తున్నా... అలాంటి ఆలోచన పెట్టుకోకండి. అని తెగేసి చెప్పింది. దీన్ని దీపక్ తీవ్ర అవమానంగా భావించాడు. అయినా ఆమెను మర్చిపోలేదు కదా మరింతగా ప్రేమించ సాగాడు. చివరకు ఆ యువతి గట్టిగా మందలించడంతో తనకు దక్కనిది మరెవ్వరికీ దక్కరాదన్న అక్కసుతో కొందరు కిరాయి మూకలకు రూ.1.5 లక్షల సుపారీ ఇచ్చి హత్య చేయించాడు. ఈ హత్యలో తాను కూడా పాలు పంచుకున్నాడు.
 
ఆ తర్వాత శవాన్ని చాపలో చుట్టి నదిలో పడేశాడు. మార్చి 27వ తేదీన నీటిపై తేలుతున్న మృతదేహాన్ని గుర్తించిన స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం చేరవేశారు. వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దీపక్ సావ్‍తో పాటు మరికొందరిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టామని చెబుతున్నా వారికి సిగ్గులేదు : కొడాలి నాని