భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురువారం ఢిల్లీలో కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. వయసురీత్యా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఆయనకు ఇంటివద్దే చికిత్స అందిస్తున్నారు. ఐతే 26వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్ ఢిల్లీ ఎమెర్జెన్సీ వార్డుకి తరలించారు. చికిత్స అందించినప్పటికీ ఆయన ఆరోగ్యం విషమించి 9:51 గంటలకు కన్నుమూసినట్లు ఎయిమ్స్ వైద్యలు ప్రకటించారు.