Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆధారాలు లేకుండా ఈవీఎంలను తప్పుబట్టలేం : సుప్రియా సూలే

Supriya Sule

ఠాగూర్

, గురువారం, 26 డిశెంబరు 2024 (18:38 IST)
కాంగ్రెస్ పార్టీతో పాటు పలు రాజకీయ పార్టీలు ఈవీఎం పనితీరుపై నిందారోపణలు చేస్తున్నాయి. ఈవీఎంలను హ్యాక్ చేసి బీజేపీ ఎన్నికల్లో గెలుస్తుందంటూ ఆరోపణలు చేస్తున్నాయి. అయితే, ఎన్సీపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి మాజీ మంత్రి శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే మాత్రం ఈవీఎంలను తప్పుబట్టడం లేదు. ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లో తాను నాలుగుసార్లు విజయం సాధించానని, అలాంటపుడు అందులో స్కాం ఉందని ఎలా చెప్పగలుగుతామని చెప్పారు. 
 
అయితే, ఈవీఎంలలో అవకతవకలపై కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని, ఇందులో అవాస్తవాలను బయటకు తీసుకొచ్చేలా చర్చ జరగాల్సి ఉందని ఆమె అన్నారు. ఓటర్ల జాబితాపై చాలా మంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారని, కాబట్టి ఈవీఎం అయినా, బ్యాలెట్ పేపర్ అయినా పారదర్శకంగా జరిగితే ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని చెప్పారు. ప్రజలు బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరగాలని కోరుకుంటే అలాగే చేయాలని, ఈవీఎంలు కావాలనుకుంటే వాటినే ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంకీర్ణ ప్రభుత్వంపై చిందులేసిన ఆర్కే రోజా.. తదుపరి ప్రభుత్వం మాదే