Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యభిచారం చేసేందుకు నిరాకరించిన బాలిక.. కొట్టి చంపిన అక్కబావ

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (18:31 IST)
ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలో అదృశ్యమైన 17 బాలిక శవమై కనిపించింది. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెల్లడైంది. ఈ బాలిక వ్యభిచారం చేసేందుకు నిరాకరించడంతో సొంత అక్క, బావలే కొట్టి కొట్టి చంపేసినట్టు తేలింది. ఈ బాలిక మృత‌దేహాన్ని జార్ఖండ్‌లోని సోనార్ డ్యాం వ‌ద్ద క‌నుగొన్న పోలీసులు మేజిస్ట్రేట్ స‌మ‌క్షంలో దాన్ని వెలికితీశారు. 
 
బాలిక‌ను స్వ‌యంగా ఆమె అక్క‌లు రాఖీదేవి (30), రూపాదేవి (25) బావ ధ‌నంజ‌య్ అగర్వాల్ (30) ప్ర‌తాప్ కుమార్ సింగ్‌, నితీష్ అనే మ‌రో ఇద్ద‌రు నిందితులు క‌లిసి హ‌త్య చేయ‌గా నితీష్ మిన‌హా నిందితులంద‌రినీ పోలీసులు అరెస్టు చేశారు. పోస్ట్‌మార్టం నివేదిక‌లో బాలిక త‌ల‌కు గాయాలైన‌ట్టు వెల్ల‌డైంది. అయితే బాలిక ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని ఆమె అక్క‌లు క‌ట్టుక‌ధ‌లు అల్లారు.
 
పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం బాలిక త‌ల్లితండ్రులు మ‌ర‌ణించ‌డంతో స‌ద్నా ప్రాంతంలో వ్య‌భిచార వృత్తిలో ఉన్న‌ సోద‌రి రాఖీదేవి ఇంట్లో బాలిక ఉంటోంది. రాఖీ, ద‌నుంజ‌య్‌లు బాలిక‌ను వ్య‌భిచారం చేయాల‌ని ఒత్తిడి చేసేవారు. 
 
బాలిక ఓ యువ‌కుడిని ప్రేమిస్తూ అతడిని పెండ్లి చేసుకుంటాన‌ని చెప్ప‌గా అక్క‌, బావ నిరాక‌రించారు. ఇక రాఖీ ప్రియులైన ప్ర‌తాప్‌, నితేష్‌లు బాలిక‌పై క‌న్నేసి రాఖీ సాయంతో ఆమెపై ప‌లుమార్లు లైంగిక దాడికి య‌త్నించారు 
 
ఈ క్ర‌మంలో రాఖీ ఇంట్లో లేని స‌మ‌యంలో హ‌త్య‌కు రెండ్రోజులు ముందు ఆమె ఇంటికి వ‌చ్చిన ప్ర‌తాప్ బాధితురాలిపై లైంగిక దాడికి పాల్ప‌డి ఆమెను హ‌త్య చేశాడు. ఆపై ఈ విష‌యం రూప, ధ‌నంజ‌య్‌ల‌కు తెలుప‌గా అంద‌రూ క‌లిసి మృత‌దేహాన్ని ఆటోలో నిర్జ‌న ప్ర‌దేశానికి తీసుకువెళ్లి పాతిపెట్టినట్టు తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం