Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య కోర్కెలు తీర్చేందుకు చైన్‌స్నాచర్‌గ మారిన భర్త

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (09:32 IST)
అతనికి కొత్తగా వివాహమైంది. భార్యకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని భావించాడు. అదేసమయంలో భర్త మనసులోని విషయాన్ని గ్రహించిన భార్య కూడా అందుకు తగినట్టుగా నడుచుకోవడం ప్రారంభంచింది. అదేసమయంలో విచ్చలవిడిగా కోర్కెలు కోరసాగింది. వీటిని తీర్చం నవ వరుడుకు తలకు మించిన భారంగా మారింది. దీంతో భర్త కోర్కెలు తీర్చడానికి చైన్ స్నాచర్‌గా మారాడు. ఈఘటన మహారాష్ట్రలోని పూణె నగరంలో చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పుణె వాకడ్‌ ప్రాంతానికి యాదవ్‌ అనే వ్యక్తి ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. 
 
కొత్తగా పెళ్లైంది.. ఇక భార్య గోముగా తన కోరికల చిట్టా విప్పడంతో యాదవ్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. ఫుడ్‌ డెలవరీ బాయ్‌గా తనకు వచ్చే జీతంతో భార్య కోరికలు తీర్చలేనని అర్థం అయ్యింది. 
 
ఈ క్రమంలో ప్రవృత్తిగా చైన్‌ స్నాచింగ్‌ను ఎంచుకున్నాడు. రంగంలోకి దిగడానికి ముందు నెట్టింట్లో పలు చైన్‌ స్నాచింగ్‌ వీడియోలను నిశితంగా పరిశీలించాడు. ఆ తర్వాత రంగంలోకి దిగాడు యాదవ్‌. 
 
ఇక చైన్‌ స్నాచింగ్‌ చేయడం కోసం యాదవ్‌ రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకునేవాడు. పోలీసులకు చిక్కే వరకు ఏడు ప్రాంతాల్లో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడి.. సుమారు 121 గ్రాముల బంగారం.. రెండు బైక్‌లు దొంగిలించాడు. 
 
ఈ క్రమంలో ఆదివారం వాకడే ప్రాంతాన్ని తన టార్గెట్‌గా ఎంచుకున్నాడు యాదవ్‌. ఆ ప్రాంతంలో రెక్కి నిర్వహించసాగాడు. అదేసమయంలో అక్కడ పెట్రోలింగ్‌ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు యాదవ్‌ కదలికల్లో తేడా కొట్టింది. దాంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. యాదవ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments