Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీఎస్‌ఎన్‌ఎల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్ః రూ.49లకే 28 రోజుల వ్యాలిడిటీ

Advertiesment
బీఎస్‌ఎన్‌ఎల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్ః రూ.49లకే 28 రోజుల వ్యాలిడిటీ
, బుధవారం, 9 జూన్ 2021 (13:23 IST)
భారత ప్రభుత్వానికి చెందిన టెలికం సంస్థ (బీఎస్‌ఎన్‌ఎల్) అత్యంత చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. కేవలం రూ. 49లకే 28 రోజుల వ్యాలిడిటీని ఈ ప్లాన్ కలిగి ఉండడం విశేషం. ఇది అత్యంత చౌకైన ప్లాన్. దీని ధర కేవలం రూ. 49 మాత్రమే. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 100 నిమిషాల టాక్ టైం లభిస్తుంది. దీంతో పాటు 2 జీబీ డేటా కూడా వాడుకోవచ్చు. 100 ఎస్ఎంఎస్ లను పంపించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు.
 
జియోతో పాటు వోడాఫోన్ ఐడియా సైతం ఇలాంటి ప్లాన్లను తీసుకువచ్చాయి. జియో కస్టమర్లు ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ కాలింగ్‌తో పాటు నిత్యం 1 జీబీ డేటా పొందొచ్చు. నిత్యం 100 ఎస్ఎంఎస్ లను పంపించుకోవచ్చు. జియోకు చెందిన వివిధ యాప్ లకు ఉచితంగా సబ్ స్క్రిప్షన్ పొందొచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 24 రోజులు. 
 
వోడాఫోన్ ఐడియా కూడా రూ.149 తో అత్యంత తక్కువ ధరకు ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్‌తో అన్ లిమిటెడ్ కాలింగ్‌తో పాటు 2 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. 300 SMS లు కూడా లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా బంగారు నాణెం రికార్డ్.. ఏకంగా వేలంలో రూ.14కోట్లు పలికింది..!