Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగానదిలో తేలుతూ వచ్చిన రాయి... ఆశ్చర్యపోయిన స్థానికులు

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2023 (10:58 IST)
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాకు సమీపంలో ఓ ఆశ్చర్యకర సంఘటన జరిగింది. గంగానదిలో ఓ రాయి తేలుతూ వచ్చింది. దీన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయి దానిని పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. ఆ రాయిపై జైశ్రీరామ్ అని రాసివుండటంతో అది రామసేతు నిర్మాణానికి ఉపయోగించి శిలేనని బావిస్తూ ఓ నీటితొట్టెలో ఉంచి పూజలు చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన స్థానికులతో పాటు చుట్టుపక్కలవారు ఆ రాయిని చూసేందుకు పోటెత్తుతున్నారు. పైగా, రాయి దొరికిన ప్రాంతం పేరును రామ్ ఘాట్‌గా మార్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, తాజాగా తేలియాడుతూ వచ్చిన రాయి బరువు 9 కిలోల ఉన్నట్టు స్థానికులు తెలిపారు. తర్వాత మరోమారు దానిని తూకం వేస్తే 14 కేజీలకు పెరిగిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నీళ్లలో వేస్తే మాత్రం అది తేలుతుందని చెప్పారు. గతంలో ఇక్కడ ఇదే రోజుల్లో ఇదే ఘాట్‌పై బంగారు రంగు తాజేలు కనిపించిందని, దానిని తిరిగి నదిలోనే విడిచిపెట్టామని వివరించారు. 
 
ఉద్యోగం చేయొద్దని భార్య అరచేయి నరికేసిన భర్త.. ఎక్కడ? 
 
ఉద్యోగం చేయొద్దని ఓ సీఆర్పీఎఫ్ జవాను భార్య చేయి నరికేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సతీష్ కుమార్ అనే వ్యక్తి సీఆర్పీఎఫ్ జవానుగా పని చేస్తున్నాడు. అతడి భార్య కూడా ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తుంది. అయితే, తన భార్య ఉద్యోగం చేయడం ఏమాత్రం ఇష్టం లేని సతీశ్ కుమార్.. భార్యకు పలుమార్లు చెప్పారు. కానీ, ఆమె భర్త మాటను పెడచెవిన పెట్టారు. ఈ క్రమంలో ఆమె ప్రమోషన్ కోసం అర్హత పొందేందుకు పరీక్ష రాయాలని ఢిల్లీకి శుక్రవారం మధ్యాహ్నం భర్తతో కలిసి వెళ్లింది. 
 
ఢిల్లీలోని ఆదర్శ్ నగర్‌లోని ఓ చిన్న హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. అక్కడ వారి మధ్య ఉద్యోగం విషయంపై మళ్లీ గొడవ జరిగింది. కొంత సమయం తర్వాత సర్దుకునిపోయి, హోటల్ సిబ్బందితోనే భోజనం తెప్పించుకుని ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఈ భోజనంలో భార్యకు తెలియకుండా సతీశ్ కుమార్ మత్తు కలిపాడు. ఇది తెలియని ఆమె స్పృహ కోల్పోయింది. 
 
దీంతో ఆమెను మంచానిక కట్టేసి అరచేయి నరికేసి అక్కడ నుంచి పారిపోయాడు. ఆ నొప్పితో ఆమె స్పృహలోకి వచ్చింది. లేచి చూసి తన పరిస్థితిని అర్థం చేసుకుని గట్టిగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది వచ్చారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న బాధితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments