Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 కోట్ల మంది ఉద్యోగాలు ఊడిపోయాయ్- రాహుల్.. సీఎంఐఈ రిపోర్ట్ కూడా..?

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (19:00 IST)
దేశంలో కరోనా విజృంభిస్తోంది. కోవిడ్ కారణంగా గడిచిన నాలుగు నెలల కాలంలో రెండు కోట్ల మంది ఉద్యోగాలు ఊడిపోయాయని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అన్నారు. నానాటికీ పెరిగిపోతున్న నిరుద్యోగతను, ఆర్థిక వ్యవస్థ విధ్వంసాన్ని ఎంతో కాలం దేశ ప్రజలకు తెలియకుండా దాచలేరన్నారు.

ఇప్పటి వరకు ఉద్యోగాలు కోల్పోయిన రెండు కోట్ల మందికి చెందిన కుటుంబాలు తీవ్ర సమస్యల్లోకి జారుకున్నాయని తెలిపారు. ఈ సమస్యను తప్పుడు వార్తా కథనాలతో, ఫేస్‌బుక్‌లో విద్వేష పోస్టులతో మరుగుపర్చలేరని రాహుల్‌ పరోక్షంగా మోదీ సర్కార్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు.
 
మరోవైపు కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగాలు పోయాయి. కోట్లాదిమందిపై ప్రభావం పడింది. జూలై నెలలో దాదాపు 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. జూలైలో 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) తెలిపింది. ఉద్యోగాల కోత రోజురోజుకు పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.
 
సీఎంఐఈ డేటా ప్రకారం ఏప్రిల్ 2020లో 17.7 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. మే నెలలో మరో 0.1 మిలియన్ల మంది ఉద్యోగం కోల్పోయారు. అదే సమయంలో జూన్ నెలలో మాత్రం 3.9 మంది కొత్తగా ఉద్యోగంలో చేరారు. మళ్లీ జూలై నెలలో 5 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. 
 
లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి జూలై నాటికి వేతన ఉద్యోగుల పరిస్థితి దిగజారింది. దీంతో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 18.9 మిలియన్లకు పెరిగింది. రికవరీ ఆరోగ్యకరంగా లేదని, ఉద్యోగాలు ఉన్నవారి పరిస్థితి కూడా ఒత్తిడి, వేతనాల కోత వంటి వివిధ కారణాలతో ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments