Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్టల్ బ్యాలెట్ల‌పై వైకాపాకు చుక్కెదురు : ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేం!

ఠాగూర్
ఆదివారం, 2 జూన్ 2024 (11:28 IST)
పోస్టల్ బ్యాలెట్ల అంశంలో అధికార వైకాపాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో గట్టి షాక్ తగలింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై ఆర్వో (రిటర్నింగ్ ఆఫీసర్) సంతకం ఉంటే సరిపోతుందని, స్టాంపు, హోదా లేకపోయినా ఫర్వాలేదన్న ఎన్నికల సంఘం వాదనలను సమర్థిస్తూ ఆంధ్రప్రదేశ్  హైకోర్టు శనివారం తీర్పును వెలువరించింది. 
 
వివాదాస్పదమైన పోస్టల్ బ్యాలెట్ల అంశంలో వైసీపీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారం 13ఏపై ఆర్వో సంతకంతో పాటు కనీసం చేతిరాతతో అయినా హోదా వివరాలు రాసి ఉండాలని ఎన్నికల సంఘం గతంలో పేర్కొందని, కానీ ఏపీ సీఈవో అందుకు భిన్నంగా మెమో జారీ చేశారని వైసీపీ తన పిటిషన్‌లో ఆరోపించింది. సంతకం ఉంటే చాలని, సీల్ లేకపోయినా ఫర్వాలేదని మెమోలో పేర్కొనడం ఈసీ నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది.
 
ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాదనలు ఆలకించిన పిమ్మట తీర్పును శనివారానికి వాయిదా వేసింది. ఆ ప్రకారంగా శనివారం తీర్పును వెలువరిస్తూ, ఈసీతో ఏకీభవిస్తూ తీర్పు వెలువరించింది. పోస్టల్ బ్యాలెట్‌పై స్టాంపు లేకపోయినా అది కౌంటింగ్‌కు చెల్లుబాటు అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో వైసీపీ పిటిషన్‌ను తోసిపుచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments