Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నకూతురిపై ఏడాదిగా లైంగిక దాడి.. ఆపై గర్భవతిని చేశాడు.. నోట్లో గుడ్డలు కుక్కి..

కన్నకూతురిపైనే ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్న కామాంధుడి ఉదంతం బయటపడింది. ఒడిశాకు చెందిన ఓ కామాంధుడు.. వావి వరుసలు మరిచి ఈ దురాగతానికి ఒడిగట్టాడు. దీనిపై నగరం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీస

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (09:06 IST)
కన్నకూతురిపైనే ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్న కామాంధుడి ఉదంతం బయటపడింది. ఒడిశాకు చెందిన ఓ కామాంధుడు.. వావి వరుసలు మరిచి ఈ దురాగతానికి ఒడిగట్టాడు. దీనిపై నగరం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి పదేళ్ల క్రితం కుటుంబంతో నగరానికి వచ్చి ఓ కాలనీలో నివసిస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. భార్యాభర్తలిద్దరూ.. కుమార్తెసహా ఓ పరిశ్రమలో కూలీలుగా పనిచేస్తున్నారు. 
 
ఈ కామాంధుడు ఏడాదిగా కూతురిపై లైంగికదాడి చేస్తున్నాడు. ఆమె ప్రతిఘటిస్తే చంపుతానని బెదిరిస్తూ, అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి, కొట్టి తన కామం తీర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చింది. ఈ విషయం భార్యకు తెలిసినా బయట పెట్టలేదు. ఎవరికైనా చెబితే కుటుంబం మొత్తాన్ని అంతమొందిస్తానని బెదిరించాడు.
 
బాలిక గర్భం దాల్చిన విషయం తెలుసుకున్న ఇంటి యజమాని, ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా... నేరాన్ని అంగీకరించాడు. లైంగికదాడి, మైనార్టీ బాలికను గర్భవతిని చేయడం, వేధించడం తదితర సెక్షన్లపై కేసు నమోదు చేశారు. నిందితుడి ఘాతుకం స్థానికంగా కలకలం రేపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నవీన్ చంద్ర తన భార్యను టార్చెర్ పెడుతున్నాడంటూ కాలనీవాసుల ఫిర్యాదు !

Kesari2 : అక్షయ్ కుమార్ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Ritu Varma: వైష్ణవ్ తేజ్‌తో ప్రేమాయణం.. ఖండించిన రీతు వర్మ.. కెరీర్‌పై ఫోకస్

Kingdom: జూలై 4న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' చిత్రం విడుదల

Pitapuram: లోక కళ్యాణం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంబాయాగం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం