Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా ఉత్పత్తులకు భారత్‌కు ఢోకా లేదు.. భారత్ రేడియో, టీవీలపై పాక్ నిషేధం అమలు..

చైనా ఉత్పత్తులకు భారత్‌లో ఎలాంటి ఢోకా లేదని గ్లోబల్ టైమ్స్ మీడియా సంస్థ విశ్లేషించింది. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలంటూ భారత్‌లోని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు.. రాజకీయంగా ఏమాత్రం ప్రభావం చూపల

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (07:26 IST)
చైనా ఉత్పత్తులకు భారత్‌లో ఎలాంటి ఢోకా లేదని గ్లోబల్ టైమ్స్ మీడియా సంస్థ విశ్లేషించింది. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలంటూ భారత్‌లోని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు.. రాజకీయంగా ఏమాత్రం ప్రభావం చూపలేవంటూ చైనా ప్రభుత్వ ఆధీనంలోని గ్లోబల్ టైమ్స్ మీడియా సంస్థ విశ్లేషించింది.

అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌ చేరికతోపాటు మసూద్‌ అజ్‌హర్‌ను ఐరాస ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలోనూ చైనా అడ్డుగా నిలుస్తున్న నేపథ్యంలో..భారత్‌లో ఆ దేశ ఉత్పత్తులపై వ్యతిరేక ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే.
 
దీంతో భారత్‌లో భారత్‌లో చైనా ఉత్పత్తులను కొనకూడదని పిలుపునిస్తారని.. అయితే వాళ్లనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరదని సదరు పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం చైనాతో భారత్‌కున్న వ్యాపార బంధాలపైనా ఈ ఉద్యమం ప్రభావం చూపలేదని చెప్పింది. అయితే ఈ అంశాలపై భారత్‌, చైనా చర్చిస్తున్నాయని.. త్వరలోనే పరిష్కారం దొరికే అవకాశముందని పత్రిక అభిప్రాయం వ్యక్తం చేసింది. 
 
ఇదిలా ఉంటే.. పాకిస్థాన్‌లో భారత రేడియో, టీవీ ప్రసారాలపై నిషేధం శుక్రవారం నుంచి అమలు కానుంది. శుక్రవారం మధ్యాహ్నం ప్రసారాలు నిలిపివేయనున్నట్లు పాకిస్థాన్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా నియంత్రణ ప్రాధికార సంస్థ (పెమ్రా) ప్రతినిధులు తెలిపారు. భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తలు పెరిగిన క్రమంలో ప్రజల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ చర్య పట్ల కేబుల్‌ ఆపరేటర్లు, వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు పాక్‌ తాజా చర్యపై భారత్‌ కూడా స్పందించింది. నిషేధం విధించడం దురదృష్టకరమని.. పాక్‌ ఆత్మవిశ్వాస లోపాన్ని అది తెలియజేస్తుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ అన్నారు. పాక్‌ నటీనటులపై భారత ప్రభుత్వం ఏ నిషేధమూ విధించలేదని స్పష్టం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Udaya Bhanu: నెగెటివ్ అవతార్‌లో ఉదయభాను.. సత్యరాజ్ బర్బారిక్‌‌లో..?

రామ్‌చ‌ర‌ణ్ పాన్ మూవీ గేమ్ చేంజర్ కు ఐమ్యాక్స్‌ గ్రీన్ సిగ్నల్

ఇన్ని కండోమ్‌లైతే కన్యలు దొరకడం కష్టమే, ఐతే మేకలు, కుక్కలతో శృంగారం కోసం కొనండి: చిన్మయి ఘాటు రిప్లై

జాతస్య మరణం ధ్రువం తో సీరత్ కపూర్ సక్సెస్ తెచ్చిపెడుతుందా

Pushpa 2: రూ.1799 కోట్లకు వసూలు చేసిన పుష్ప-2.. సరికొత్త రికార్డులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Women Teachers Day: సావిత్రీబాయి ఫూలే జయంతి- మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments