Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ అక్టోబర్ 26న లేదా 27న డిశ్చార్జ్ అవుతారా? 4 రోజుల్లో చెన్నైకి రిచర్డ్..

అపోలోలో మూడు వారాలకు పైగా చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత కోలుకుంటున్నారని.. ఆమె త్వరలో డిశ్చార్జ్ కానున్నారని వార్తలు వస్తున్నాయి. సింగపూర్, లండన్‌, ఎయిమ్స్ వైద్యుల సమక్షంలో అపోలోలో వైద్యం పొ

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (07:14 IST)
అపోలోలో మూడు వారాలకు పైగా చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత కోలుకుంటున్నారని.. ఆమె త్వరలో డిశ్చార్జ్ కానున్నారని వార్తలు వస్తున్నాయి. సింగపూర్, లండన్‌, ఎయిమ్స్ వైద్యుల సమక్షంలో అపోలోలో వైద్యం పొందిన జయలలిత ఆరోగ్య పరిస్థితి మెరుగైందని.. అందుకే ఆమెను ఈ నెల 26 లేదా 27వ తేదీన డిశ్చార్జ్ చేయాలని అనుకుంటున్నట్లు అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి గురువారం ప్రకటించారు. కానీ అపోలో ఆస్పత్రి మాత్రం దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.  
 
కాగా జయలలిత ఆస్పత్రిలో చేరి గురువారానికి 29 రోజులు పూర్తయ్యాయి. సీఎం జయ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ శివకుమార్ నేతృత్వంలో ప్రారంభమైన చికిత్సలో లండన్ ఎయిమ్స్, సింగపూర్ వైద్యులు పాలుపంచుకున్నారు. ప్రస్తుతం జయలలితకు ఫిజియోథెరపీ మాత్రమే కొనసాగుతోంది. కాగా, జయ డిశ్చార్జ్‌పై నిర్ణయం తీసుకునేందుకు లండన్ డాక్టర్ రిచర్డ్ మరో నాలుగు రోజుల్లో చెన్నై రానున్నట్లు సమాచారం. 
 
అమ్మ కోలుకోవాలని కోరుతూ అనేక ఆలయాల్లో అన్నాడీఎంకే శ్రేణులు ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మ డిశ్చార్జ్ కానున్నారనే వార్త అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది. అమ్మ త్వరలో డిశ్చార్జ్ అయి సీఎంగా బాధ్యతలు చేపడతారని తెలుసుకున్న కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments