Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాగు చట్టాలపై చర్చ : రైతులకు కేంద్రం ఆహ్వానం - మొబైల్ టవర్లు ధ్వంసం

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (16:05 IST)
కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో గత నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలకు దేశ వ్యాప్తంగా 25కు పైగా రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. అలాగే, అనేక రాజకీయ పార్టీలు సైతం అండగా నిలిచాయి. రైతులకు విఘాతం కలిగించే ఈ సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులతో పాటు.. విపక్ష పార్టీల రాజకీయ నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఈ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న నిర్వ‌హిస్తున్న రైతులను మ‌రోసారి చ‌ర్చ‌ల‌కు కేంద్రం ఆహ్వానించింది. ఈ నెల 30న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో చర్చ‌ల‌కు ర‌మ్మ‌ని పిలిచింది. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. రైతుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపే ముందు అందులో అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చించేందుకు కేంద్ర మంత్రులు అమిత్ షా, పియూష్ గోయ‌ల్ స‌మావేశం కానున్నారు. 
 
మరోవైపు, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతుగా పంజాబ్‌లో మొబైల్‌ టవర్లను ధ్వంసం చేస్తున్నారు. మొగా సమీపంలోని ఏక్తా నగర్ స్థానికులు ఆదివారం రాత్రి మొబైల్ టవర్‌ను ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. 
 
మరోవైపు ఫిరోజ్‌పూర్‌లోని టిబ్బి కలాన్‌ గ్రామస్తులు సోమవారం మరో సెల్‌ టవర్‌ను ధ్వంసం చేశారు. టవర్‌పైకి ఎక్కి కేబుల్‌ వైర్లు కత్తిరించారు. ఢిల్లీ సరిహద్దులోని సింఘు వద్ద రైతుల నిరసనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 1500కుపైగా మొబైల్‌ టవర్లను పంజాబ్‌ వాసులు ధ్వంసం చేశారు. ప్రధానంగా ముఖేష్ అంబానికి చెందిన జియో సెల్‌ టవర్లను వీరు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. 
 
కాగా మొబైల్ టవర్లను ధ్వంసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పోలీసులను ఆదేశించారు. మరోవైపు ఈ చర్యలను రైతులు ఖండించారు. ఈ విధ్వంస చర్యలతో తమకు సంబంధం లేదని, ఇలాంటి వాటికి తాము దూరమని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments