కిరాతకుడిగా మారిన బీజేపీ నేత.. రైతును హత్య చేసి.. కుమార్తెను..?

సెల్వి
సోమవారం, 27 అక్టోబరు 2025 (22:14 IST)
మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేత కిరాతకంగా ఓ రైతును హత్య చేయడమే కాకుండా.. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతు భార్య, ఇద్దరు పిల్లలపై కూడా దుండగులు దాడి చేయించారు. ఇంకా ఆ రైతు కుమార్తె పట్ల అభ్యంతరకంగా ప్రవర్తించాడని.. ఆమె దుస్తులు చించివేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. 
 
వివరాల్లోకి వెళ్తే.. గణేశ్ పుర గ్రామానికి చెందిన రైతు రామ్ స్వరూప్‌కు, స్థానిక బీజేపీ నేత మహేంద్ర నాగర్‌కు మధ్య కొంతకాలంగా భూమి విషయంలో వివాదం నడుస్తోంది. దీంతో మహేంద్ర అనుచరులతో రైతు కుటుంబంపై దాడి చేశాడు. మొదట రాడ్లతో విచక్షణారహితంగా కొట్టి, అనంతరం థార్ జీపుతో తొక్కించడంతో రామ్ స్వరూప్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. 
 
ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన కుటుంబ సభ్యులపై దాడి చేయించాడు. రైతు రామ్ కుమార్తె పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై బాధితురాలైన బాలిక ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments