భర్తపై అనుమానంతో గంజాయిని అలా వాడింది.. చివరికి..?

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (14:23 IST)
భర్తపై అనుమానంతో భర్తను పోలీసులకు పట్టించాలనుకుంది. కానీ ఆమె అడ్డంగా దొరికిపోయింది. యూపీలోని ఎస్జీఎం నగర్‌లో ఓ ఇద్దరు దంపతులు నివసిస్తున్నారు. భర్త ఆటో డ్రైవర్ కాగా, భార్య గృహిణి. అయితే భర్త విధులు ముగించుకున్న తర్వాత ఇంటికి ఆలస్యంగా రావడం, ఒక్కొక్క రోజు ఇంటికే రాకపోవడంతో అతనిపై భార్య అనుమానం పెంచుకుంది.
 
మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అనుమానం పెట్టుకుంది. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవలు కూడా చోటుచేసుకున్నాయి. ఎలాగైనా భర్తపై ప్రతీకారం తీర్చుకోవాలని భార్య కంకణం కట్టుకుంది.
 
దీంతో ఢిల్లీకి చెందిన పవన్ అనే వ్యక్తితో 700 గ్రాముల గంజాయిని కొనుగోలు చేసి.. భర్తలో ఆటోలో దాచి పెట్టింది. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. పోలీసులు తనిఖీ చేయగా ఆటోలో గంజాయి లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
 
భర్తను అరెస్టు చేయించాలనుకున్న ఆమెకు పోలీసులు షాక్ ఇచ్చారు. దర్యాప్తులో భాగంగా ఆమెను సుదీర్ఘంగా విచారించడంతో.. తానే గంజాయి ఆటోలో ఉంచినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులకు ఆమె అడ్డంగా దొరికి కటకటాల పాలైంది. ఆమెతో పాటు పవన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments