Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రలేచి ఎవరి మొహం చూశాడో ఏమోకానీ..?

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (16:54 IST)
నిద్రలేచి ఎవరి మొహం చూశాడో ఏమోకానీ ఓ వ్యక్తి నిద్రలేవగానే ఇంటి పైకప్పుపై రెండు సంచుల్ని గుర్తించాడు. అందులో పెద్దమొత్తంలో నగదు వుండటంతో షాకయ్యాడు. అంతేగాకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.  ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. యూపీ మేరఠ్‌లో నివాసం ఉండే పవన్‌ సింఘాల్‌ అనే వ్యాపారి ఇంట్లో నేపాల్‌కు చెందిన రాజు అనే వ్యక్తి పని చేసేవాడు. ఇతను రెండేళ్ల కిందట అక్కడి నుంచి వెళ్లిపోయి ఇటీవల తిరిగొచ్చాడు. ఆ సమయంలో ఇంటి యజమాని లేకపోవడంతో సెక్యురిటీగార్డుతో కలిసి దొంగతనానికి పాల్పడ్డాడు. 
 
దాదాపు రూ. 40 లక్షల నగదు ఉన్న రెండు సంచులతో వెళ్తే సీసీ కెమెరాల్లో నమోదై దొరుకుతాననే ఆలోచనతో వాటిని ఆ ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటిపై విసిరేశాడు. తర్వాత వచ్చి సంచులను తీసుకుందామని వాటిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.
 
ఈ క్రమంలో మరుసటి రోజు బుధవారం ఉదయం ఆ పక్కింట్లో ఉండే వరుణ్‌శర్మ తన ఇంటిపై ఉన్న సంచుల్లో భారీగా నగదు ఉన్నట్లు గుర్తించారు. ఎవరో డబ్బును దొంగిలించి ఇక్కడ పెట్టి ఉంటారనుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో దొంగతనానికి పాల్పడినట్లు తేలిన రాజు, సెక్యూరిటీ గార్డును అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments