Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఈశాన్య' అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీదే హవా

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (20:36 IST)
ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ నెల 16వ తేదీన త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరుగగా సోమవారం నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. 
 
త్రిపుర రాష్ట్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియాలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ రాష్ట్రంలో బీజేపీ కూటమికి 36 నుంచి 45 స్థానాలు వస్తాయని, లెఫ్ట్ కూటమికి 6 నుంచి 11 స్థానాలు, తిప్రా మోథా పార్టీకి 9 నుంచి 16 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. 
 
నాగాలాండ్ రాష్ట్రంలో బీజేపీ - ఎన్డీపీపీ కూటమికి విజయం సాధిస్తుందని తెలిపింది. ఈ కూటమికి 35 నుంచి 43 సీట్లు రావొచ్చని, కాంగ్రెస్ పార్టీకి ఒకటి నుంచి మూడు సీట్లు, ఎన్.పి.ఎఫ్‌కు 2 నుంచి 5 సీట్లు దక్కుతాయని తెలిపింది. 
 
ఇక మేఘాలయ రాష్ట్రంలో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్.పి.పి) విజయభేరీ మోగిస్తుందని జీన్యూస్ - మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ వివరించింది., ఎన్.పి.పి.కి 21 నుంచి 26 సీట్లు, తృణమూల్ కాంగ్రెస్‌కు 8 నుంచి 13 సీట్లు, బీజేపీకి 6 నుంచి 11 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 3 నుంచి 6 సీట్లు, ఇతరులకు 10 నుంచి 19 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments