Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత మేనకోడలు దీప ఆత్మహత్యాయత్నం

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (12:58 IST)
మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత మేనకోడలు దీప ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. తన భర్త మాధవ్‌తో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం నగరంలోని ఓ కార్పొరేట్ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. 
 
భర్త మాధవ్‌తో ఏర్పడిన మనస్పర్థలపై ఆమె ఓ వాట్సాప్‌లో తీవ్ర పదజాలంతో మెసేజ్ పెట్టినట్టు తెలిసింది. తన భార్య దీప ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయంపై మాధవ్ స్పందిస్తూ, దీపన తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్టు చెప్పారు. ఆమెను ఎంతో బాగా చూసుకుంటున్నట్టు తెలిపారు. ఆమె అస్వస్థతకు గురికావడంతో తానే ఆమెను ఆస్పత్రిలో చేర్పించినట్టు తెలిపారు. 
 
పలు రుగ్మతలకు సంబంధించి మందులు ఎక్కువగా వాడటం వల్ల ఆమె అస్వస్థతకు గురైనట్టు, ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. కాగా, జయలలిత మరణం తర్వాత దీపతో పాటు ఆమె సోదరుడు దీపక్‌కు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులు దక్కిన విషయం తెల్సిందే. ఆ తర్వాత దీప-మాధవ్‌ల మధ్య మనస్పర్థలు తలెత్తాయని అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

ఫ్యామిలీ విందులో పవన్ కళ్యాణ్ పాట పాడిన విజయ్ దేవరకొండ

హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments