Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో ఖాళీ అవుతున్న కాంగ్రెస్ - పార్టీ వీడిన సీనియర్లు

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (12:19 IST)
సీనియర్ రాజకీయ నేత, మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడారు. దీంతో ఆయనకు మద్దతుగా అనేక మంది ఆ పార్టీని వీడుతున్నారు. అంటే గులాం నబీ ఆజాద్ దెబ్బకు జమ్మూకాశ్మీర్‌లోని కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. తాజాగా ఏకంగా 64 మంది నేతలు రాజీనామా చేశారు. 
 
పార్టీని వీడిన సీనియర్ నేతల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి తారాచంద్, మాజీ మంత్రి అబ్దుల్ మాజిద్ వనీ, మనోహర్ లాల్ శర్మ, ఘారు రామ్ తదితరులు ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఉమ్మడిగా లేఖ రాశారు. 
 
"మా నేత, మార్గదర్శి గులాం నబీ ఆజాద్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన దారిలోనే మేం కూడా పార్టీని వీడాలని, ఒక సానుకూల రాజకీయ సమాజం కోసం పాటుపడాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే ఆజాద్ ఒక జాతీయ పార్టీని జమ్మూకాశ్మీర్ కోసం ప్రారంభిస్తారు. మేమందరం ఆయనతో కలిసి ఆ పార్టీలో ప్రయాణించాలని, ఆయనకు మద్దతుగా నిలిచి కాశ్మీర్‌కు ఒక మంచి భవిష్యత్‌ను అందిస్తాం" అని ఆ లేఖలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

తర్వాతి కథనం
Show comments