Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం... అజిత్ జోగి కుమారుడు అరెస్టు

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (12:48 IST)
ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకుగాను ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. 
 
అమిత్ జోగి 2013లో జరిగిన ఎన్నికల్లో మర్వాహి స్థానంలో పోటీ చేశారు. ఇందుకోసం ఆయన ఓ అఫిడవిట్‌ను సమర్పించారు. ఇందులో తన పుట్టిన తేదీతోపాటు.. కులాన్ని తప్పుగా ప్రస్తావించారు. 
 
దీంతో జోగి ప్రత్యర్థి, బీజేపీ నాయకురాలు సమీరా పైక్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సుధీర్ఘకాలంగా విచారణ సాగింది. ఈ విచారణ తర్వాత అమిత్ జోగిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. 
 
కాగా, జోగి 1977లో టెక్సాస్‌లో జన్మిస్తే.. అఫిడవిట్‌లో మాత్రం 1978లో ఛత్తీస్‌గఢ్‌లోని గౌరీలా గ్రామంలో జన్మించినట్లుగాను, తన కులాన్ని షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ)గా పేర్కొన్నట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: నాగ చైతన్య-శోభితలకు వేణు స్వామి క్షమాపణలు.. ఇకపై నోరెత్తను

యూఫోరియా మ్యూజికల్ నైట్ లో ప్రతి ఒక్క రూపాయి సమాజ సేవకే : నారా భువనేశ్వరి

పుష్ప 2 కలెక్షన్స్ రూ. 1850 కోట్లు వచ్చాయా? లెక్కలేవీ అని ఐటీ అడిగిందా?

హాసం రాజా ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణ

విశ్వక్సేన్, లైలా సెకండ్ సింగిల్ ఇచ్చుకుందాం బేబీ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments