Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐదుగురు మంత్రులకు జగన్ వార్నింగ్... తీరు మార్చుకోకపోతే...!!

ఐదుగురు మంత్రులకు జగన్ వార్నింగ్... తీరు మార్చుకోకపోతే...!!
, ఆదివారం, 7 జులై 2019 (12:57 IST)
ఏపీ సీఎం జగన్ అంటే ఏంటో ఆచరణలో చూపిస్తున్నారు. తాను ఎలాంటి వాడినని ఆయన ప్రతి విషయంలో రుజువు చేస్తున్నారు. ఇక తాను ఏరి కోరి మంత్రులను తీసుకున్నారు. వారి పనితీరు నెల రోజులను మధింపు చేశారు. ఇక మంత్రుల పేషీలు చూస్తే జాతరను తలపిస్తున్నాయి. దీంతో ఎప్పుడూ నవ్వుతూ.. అన్నా.. అమ్మా అంటూ పిలిచే ముఖ్యమంత్రి జగన్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. 
 
కేబినెట్‌లో ఏరి కోరి తెచ్చుకున్న ఆ అయిదుగురికి సీఎం తనకు ఆగ్రహం తెప్పిస్తే ఎలా ఉంటుందో చూపించారు. తాము ఏం చేసినా ఎక్కడో క్యాంపు కార్యాలయంలో కూర్చొనే ముఖ్యమంత్రికి ఎలా తెలుస్తుందిలే అనుకున్న మంత్రులకు ఆధారాలతో సహా ఏం చేసారో వివరించారు. తాను గతంలోనే చెప్పానని..ఇప్పుడు హెచ్చరిస్తున్నానని..మరో సారి ఇదే విధంగా జరిగితే మంత్రులుగా మీరు ఉండరు అని తేల్చి చెప్పేసారు.
 
వారిలో సీనియర్ మంత్రి జగన్ చెప్పిన సమాచారంతో బిత్తర పోయారు. మిగిలిన నలుగురు బతికిపోయాం అంటూ బయటపడ్డారు. ఇంతకీ అసలు ఏం జరిగింది అంటే బదిలీలపై పెద్ద ఎత్తున పైరవీలు మంత్రుల పేషీల్లోనే జోరుగా జరిగిపోతున్నాయి. 
 
ఆ అయిదుగురు మంత్రుల బంధుగణమైతే అన్నీ తామై వ్యవహరిస్తోంది. ఈ విషయం జగన్ దృష్టికి రాగానే మండిపోయారని టాక్. మరి మంత్రులకు ఇది ఫస్ట్ వార్నింగ్. తీరు మార్చుకోకపోతే ఇంతే సంగతులేమో.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం జగన్ నివాసం వద్ద డీఎస్సీ 2008 అభ్యర్థులు నిరసన