Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

ఠాగూర్
శుక్రవారం, 18 జులై 2025 (16:54 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తేరుకోలేని షాకిచ్చారు. మద్యం స్కామ్‌తో పాటు మనీ లాండరింగ్ కేసులో ఆయన కుమారుడు చైతన్య బఘేల్‌ను పోలీసులు అరెస్టు చేసింది. శుక్రవారం ఉదయం బఘేల్ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు ఆ తర్వాత చైతన్యను అదుపులోకి తీసుకున్నారు.
 
మద్యం స్కామ్‌లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో బఘేల్ పాత్ర కూడా ఉందని అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ, మద్యం సిండికేట్‌కు రూ.2 వేల కోట్ల మేరకు లబ్ది చేకూరిందని పేర్కొంది.
 
ఈ కేసుకు సంబంధించి గతంలో బఘేల్ నివాసంలో సోదాలు నిర్వహించిన దర్యాప్తు సంస్థ శుక్రవారం మరోమారు తనిఖీలు చేపట్టింది. ఉదయం దుర్గ్ జిల్లాలోని భిలాయ్ ప్రాంతంలో గల బఘేల్ నివాసానికి ఈడీ అధికారులు చేరుకుని చైతన్యను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు సంబంధించి కొత్త ఆధారాలు లభించడంతో మాజీ ముఖ్యమంత్రి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. విచారణకు చైతన్య ఏమాత్రం సహకరించకపోవడంతో అరెస్టు చేయకతప్పలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం