Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ జనతా పార్టీకి భారీ షాక్: బాబుల్ సుప్రియో బైబై

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (15:37 IST)
Babul Supriyo
పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి, సిట్టింగ్ ఎంపీ అయిన బాబుల్ సుప్రియో బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

టీఎంసీ జాతీయ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ, ఆ పార్టీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ సమక్షంలో ఆయన తృణమూల్ కండువా కప్పుకొన్నారు. బాబుల్ సుప్రియో మొన్నటి వరకు కేంద్రంలోని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఉన్నారు. 
 
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘోర పరాజయం తర్వాత జరిగిన కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో బాబుల్ సుప్రియోను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించారు. ఆ తర్వాత నుంచి బాబుల్ సుప్రియో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 
 
ఓ సారి తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొంటున్నట్టు ట్వీట్ చేశారు. కానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి ఫోన్ రావడంతో ఆయన వెనక్కి తగ్గారు. తాను ఎంపీగా కొనసాగుతానని ప్రకటించారు. అయితే, ఇది జరిగిన కొన్ని రోజులకే బాబుల్ సుప్రియో అధికార టీఎంసీలో చేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments