తెలంగాణలో 19,20 తేదీల్లో భారీ వర్షాలు

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (15:28 IST)
తెలంగాణలో 19,20 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు హెచ్చరిక జారీ చేసింది. 20న కొమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాల్‌పల్లి, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో ఒకటి రెండు ప్రదేశాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.
 
ప్రస్తుతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయని తెలిపింది. గాలులు పశ్చిమ దిశ నుంచి వీస్తున్నాయని, దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. 
 
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 13 జిల్లాల్లో చిరుజల్లులు కురిశాయి. అత్యధికంగా కొమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానుపల్లి మండలం రవీంద్ర నగర్‌లో 2.78, అదిలాబాద్‌ జిల్లా సిరికొండ 1.88, నార్నూర్ 1.63, జైనథ్ 1.55 సెంట మీటర్ల వర్షం న‌మోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments