ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కీలక నిర్ణయం : కనీస పింఛను రూ.25 వేలు

ఠాగూర్
బుధవారం, 8 అక్టోబరు 2025 (11:41 IST)
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) చందాదారులకు త్వరలో శుభవార్త అందే అవకాశం ఉంది. సుమారు 11 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కనీస పింఛను పెంపుపై ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇస్తున్న కనీస పింఛను మొత్తాన్ని గణనీయంగా పెంచే ప్రతిపాదనపై కసరత్తు జరుగుతోంది.
 
ప్రస్తుతం ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్-95) కింద నెలకు రూ.1000 కనీస పింఛను అందుతోంది. 2014లో నిర్ణయించిన ఈ మొత్తంలో ఇప్పటివరకు ఎలాంటి మార్పు లేదు. అయితే, తాజాగా ఈ కనీస పింఛనును రూ.2500కు పెంచేందుకు ఈపీఎఫీ సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు, ఉద్యోగ సంఘాలు మాత్రం పింఛనును నెలకు రూ.7500కు పెంచాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి.
 
ఈ నెల 10, 11 తేదీల్లో బెంగళూరులో జరగనున్న ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల (సీబీటీ) సమావేశంలో ఈ అంశం ప్రధాన ఎజెండాగా చర్చకు రానుంది. పింఛను పెంపుతో పాటు సంస్థ సేవలను డిజిటలైజ్ చేసే 'ఈపీఎఫ్ఎ 3.0' విధానం, ఇతర పరిపాలనా సంస్కరణలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
 
బెంగళూరు సమావేశంలో పింఛను పెంపునకు బోర్డు ఆమోదం తెలిపితే, తుది నిర్ణయం కోసం ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. కేంద్రం ఆమోదముద్ర వేసిన తర్వాతే కొత్త పింఛను అమల్లోకి వస్తుంది. కాగా, కనీసం పదేళ్ల సర్వీసు పూర్తిచేసి 58 ఏళ్లు నిండిన ఉద్యోగులు ఈపీఎస్-95 కింద పింఛను పొందేందుకు అర్హులన్న విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments