Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్డౌన్ సమయంలో పీఎఫ్ నుంచి వేల కోట్లు నగదు విత్ డ్రా, కేంద్ర మంత్రి

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (12:14 IST)
మార్చి నెలలో లాక్‌డౌన్ మొదలైన తర్వాత ఆగస్టు 31 వరకు తమ భవిష్య నిధి దాచుకున్న ఉద్యోగులు పెద్దఎత్తున నగదు విత్ డ్రా చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ వెల్లడించారు. మార్చి నెల 25 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు రూ. 39, 402.90 కోట్లను ఉద్యోగులు విత్ డ్రా చేసుకున్నారని తెలిపారు. ఈ మేరకు ఆయన పార్లమెంట్‌కు లిఖిత పూర్వక సమాధానాన్ని పంపించారు.
 
ఈ ఐదు నెలల వ్యవధిలో మహారాష్ట్రకు చెందిన ఉద్యోగులు అత్యధికంగా నగదును విత్ డ్రా చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి రూ.7,837.80 కోట్లు విత్ డ్రా కాగా ఆ తర్వాత కర్ణాటక నుంచి రూ.5,743.90 కోట్లు, తమిళనాడు నుంచి రూ.4,984.50 కోట్లు విత్ డ్రా అయ్యాయని వెల్లడించారు. కరోనా కాలంలో కష్టాలు అనుభవిస్తున్న వలస కూలీలు కోసం కేంద్రం ప్రధాన మంత్రి గరీభ్ కల్యాణ్ యోజన, ఆత్మ నిర్బర్ భారత్ స్కీంల ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో భాగంగా నెలకు రూ.15 వేలు కన్నా తక్కువ వేతనం పొందుతున్న వారు లబ్ధిని పొందారని తెలిపారు. మే నుంచి జూలై వరకు ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను కూడా 12 నుంచి 10 శాతానికి తగ్గించామని సంతోష్ గాంగ్వార్ వెల్లడించారు. లాక్ డౌన్లో ఉద్యోగుల సంక్షేమం కోసం కేంద్రం అన్ని చర్యలు తీసుకుందన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments