Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్ ఎఫెక్ట్.. ఖాతాదారుల ఖాతాలోకి 8.5 శాతం వడ్డీ..

Advertiesment
కోవిడ్ ఎఫెక్ట్.. ఖాతాదారుల ఖాతాలోకి 8.5 శాతం వడ్డీ..
, బుధవారం, 9 సెప్టెంబరు 2020 (20:58 IST)
వేతన జీవుల ఈపీఎఫ్‌ ఖాతాల్లో 2019-20 సంవత్సరానికి గాను 8.5 శాతం వడ్డీ జమ చేసేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) నిర్ణయించింది. ఖాతాదారుల అకౌంట్‌లోకి వడ్డీ చెల్లింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాదారుల అకౌంట్‌లోకి 2019-20 ఆర్థిక సంవత్సరానికి చెందిన వడ్డీని రెండు విడతల్లో చెల్లించాలని నిర్ణయించింది. కోవిడ్‌-19 కారణంగా మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  
 
అయితే, తొలుత 8.15 శాతం చెల్లించి, మిగిలిన 0.35 శాతం డిసెంబర్‌లో చెల్లించాలని నిర్ణయించింది. బుధవారం జరిగిన ట్రస్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొత్తం 6 కోట్ల చందాదారుల ఖాతాల్లో ఈ మొత్తం జమ చేయనున్నారు. నిధుల కొరతను అధిగమించేందుకు స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయాన్ని ఈ సమావేశంలో ఉపసంహరించుకున్నారు.
 
2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన 8.5 శాతం వడ్డీ విషయంలో వెనుకడుగు వేయబోమని, కరోనా పరిస్థితుల వల్ల వడ్డీని రెండు వాయిదాల్లో చెల్లించాల్సి వస్తున్నదని ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డు ట్రస్టీ విర్జేష్ ఉపాధ్యాయ్ వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతి వల్ల ఆదాయం కాదు కదా.. అప్పులపై వడ్డీలు కూడా రావు : సీఎం జగన్