చత్తీస్‌గఢ్ దండకారణ్యంలో కాల్పుల మోత - మావోల హతం

Webdunia
ఆదివారం, 25 జులై 2021 (14:28 IST)
తెలంగాణ సరిహద్దుల్లోవున్న ఛ‌త్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో తుపాకుల మోత మోగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఆదివారం తెల్లవారుజామున భీకరపోరు జరిగింది. ఈ ఘటనలో ఓ మావోయిస్టు ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని సుక్మా జిల్లా చింతాగుఫా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ 150, 131 బెటాలియన్, డీఆర్జీ, ఎస్టీఎఫ్ భద్రతా దళాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. బలగాల రాకను పసిగట్టిన మావోలు కాల్పులకు తెగబడ్డారు. ఆ వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. 
 
ఈ ఘటనలో ఓ గుర్తు తెలియని మావోయిస్టు మృతి చెందినట్లు ఎస్పీ సునీల్ శర్మ ధృవీకరించారు. మావోయిస్టు మృతదేహంతో పాటు ఒక బర్మార్ తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. మవోయిస్టుల వారోత్సవాల దృష్ట్యా పోలీస్ బలగాలు అడవుల్లో గాలింపు చ‌ర్య‌ల‌ను ముమ్మరం చేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments