Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిన్ లాడెన్‌కు పట్టిన గతే కిమ్ జాంగ్‌ ఉన్‌కు పట్టాలి... డోనాల్డ్ ట్రంప్ ఆదేశం!

ధిక్కారస్వరం వినిపిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ను హతం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కంకణం కట్టుకున్నారా? ఇందుకోసం సీల్స్ టీమ్ -6కు ఆదేశాలు జారీ చేశారా? ఈ ప్రశ్నలకు అవ

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (15:30 IST)
ధిక్కారస్వరం వినిపిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ను హతం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కంకణం కట్టుకున్నారా? ఇందుకోసం సీల్స్ టీమ్ -6కు ఆదేశాలు జారీ చేశారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలే వస్తున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అధ్యక్షుడు బిన్ లాడెన్‌కు పట్టిన గతే కిమ్ జాంగ్ ఉన్‌కు పట్టేలా సీల్స్ టీమ్‌ను ఆదేశించినట్టు సమాచారం. 
 
ఇదే అంశంపై ఉత్తర కొరియా మీడియా ఓ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. కిమ్ జాంగ్ ఉన్‌ను లేపేయమంటూ గతంలో ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టిన 'సీల్ టీమ్-6'ను డోనాల్డ్ ట్రంప్ ఆదేశించడమే కాకుండా, ఆ జట్టు సభ్యులను రహస్యంగా దక్షిణ కొరియాకు పంపినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా లిబియాను ఆక్రమించుకున్నట్లుగా ఇప్పుడు తమ దేశాధ్యక్షుడిని మట్టుబెట్టడం ద్వారా ఉత్తర కొరియాను కూడా ఆక్రమించుకోవాలని ట్రంప్ చూస్తున్నారని, ఇందుకు నిదర్శనం ఆయన దక్షిణ కొరియాకు పంపిన సైన్యమేనంటూ ఆ మీడియా కథనాల్లో పేర్కొంది. 
 
ఇప్పటికే సిరియాపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసి... ప్రభుత్వ సైనిక స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకటి కాదు, దక్షిణ కొరియాకు అమెరికా ఏకంగా 17 వేల సైనిక దళాలను పంపింది. అలాగే, స్పెషల్ టీంను కూడా దక్షిణ కొరియా సరిహద్దుల్లోకి చేర్చినట్టు ఉత్తరకొరియా మీడియా ఒక ప్రత్యేక కథనంలో పేర్కొంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments