Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో తొలి మహిళా ముస్లిం జడ్జి హత్య?: పాకిస్థాన్‌కు వెళ్లొద్దని ట్రంప్ ఆదేశాలు..

అమెరికాలో జాత్యంహంకార దాడులు పెచ్చరిల్లిపోతున్నాయి. దేశంలో తొలి ముస్లిం మహిళా న్యాయమూర్తి ఎన్నికై రికార్డు సృష్టించిన షీలా అబ్దుస్ సలామ్ (65) హడ్సన్ నదిలో విగత జీవిగా కనిపించడం కలకలం రేపింది. ఈమె అనుమ

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (14:28 IST)
అమెరికాలో జాత్యంహంకార దాడులు పెచ్చరిల్లిపోతున్నాయి. దేశంలో తొలి ముస్లిం మహిళా న్యాయమూర్తి ఎన్నికై రికార్డు సృష్టించిన షీలా అబ్దుస్ సలామ్ (65) హడ్సన్ నదిలో విగత జీవిగా కనిపించడం కలకలం రేపింది. ఈమె అనుమానాస్పద రీతిలో మరణించడానికి కారణం జాతివివక్షేనని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ స్టేట్ అత్యున్నత న్యాయస్థానంలో అసోసియేట్ జడ్జిగా ఉన్న ఆమె హర్లీమ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. 
 
అయితే నదిలో ఆమె శవాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై న్యూయార్క్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఆమెపై దాడి జరిగిన ఆనవాళ్లు లేవని, ధరించిన బట్టలు కూడా చిరగలేదని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. కాగా, 2013 నుంచి న్యాయమూర్తిగా ఉన్న ఆమె, అంతకుముందు 15 సంవత్సరాలు మన్ హటన్ కోర్టులో ఫస్ట్ అపిలేట్ డివిజన్‌లో సేవలందించారు.
 
అమెరికాలో ముస్లిం మహిళ ఇలా దారుణంగా మరణించిన నేపథ్యంలో పాకిస్థాన్‌లో పర్యటనకు దేశ పౌరులు ఎవరూ వెళ్లకూడదని, ఉగ్రవాదులు అమెరికన్లే లక్ష్యంగా దాడులకు తెగబడవచ్చని డొనాల్డ్ ట్రంప్ సర్కారు హెచ్చరించింది. తప్పనిసరైతే మాత్రమే పాక్ కు వెళ్లాలని, లేకుంటే ప్రయాణాలు పెట్టుకోవద్దని హెచ్చరించింది. కొందరు ఉగ్రవాదులు కేవలం అమెరికన్లనే లక్ష్యంగా చేసుకున్నారన్న సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని తెలిపింది. విమానాలపైనా దాడులు జరగవచ్చని, ముఖ్యంగా, టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో తక్కువ ఎత్తులో ప్రయాణించాల్సి వచ్చినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments