Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

ఠాగూర్
శుక్రవారం, 4 జులై 2025 (21:48 IST)
కన్నడ నటి రన్యారావుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తేరుకోలేని షాకిచ్చారు. బంగారం అక్రమ రవాణా వ్యవహారంతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన రన్యారావుకు చెందిన 34 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను జప్తు చేశారు. ఈ విషయాన్ని ఈడీ అధికారులు అధికారికంగా వెల్లడించారు. 
 
మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద బెంగుళూరులోని విక్టోరియా లే ఔట్‌లో ఉన్న నివాస భవనం, అర్కావతి లే ఔట్‌లోని ఒక నివాసస్థలం, తుమకూరులోని ఇండస్ట్రియల్ భూమి, అనేకల్ తాలూకాలోని వ్యవసాయ భూమిని జప్తు చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ రూ.34.12 కోట్లుగా ఉంటుందని ఈడీ అధికారులు వెల్లడించారు. 
 
కాగా, దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ మార్చి తొలి వారంలో రన్యారావును బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్న విషయం తెల్సిందే. ఇది దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆమె వద్ద నుంచి 14.7 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. 
 
గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్‌పై సీఐడీ, డీఆర్ఐ అధికారుల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఈడీ అధికారులు ఆమెపై పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బంగారం అక్రమ రవాణా కేసులో ఆమె చురుకైన పాత్ర పోషించినట్టు ఈడీ దర్యాప్తులో నిర్ధారణ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

తర్వాతి కథనం
Show comments