Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూటుగా మద్యం సేవించి హాస్టల్‌లో నగ్నంగా నిద్రపోయిన హెడ్మాస్టర్ ... ఎక్కడ?

Webdunia
గురువారం, 27 జులై 2023 (09:50 IST)
పీకల వరకు మద్యం సేవించి హాస్టల్‌లో నగ్నంగా నిద్రపోయిన స్కూల్ హెడ్మాస్టర్‌ బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ తంతుకు సంబంధించి వీడియో ఒకటి వైరల్ కావడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి, సదరు హెడ్మాస్టర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని బాహఖ్ జిల్లా విశేశ్వర్ గంజ్ బ్లాక్‌లోని శివపూర్ బైరాగీ పాఠశాలలో ఓ హెడ్మాస్టర్ పూటుగా తాగి నగ్నంగా నిద్రిపోయాడు. దీన్ని కొందరు విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అయింది. 
 
హెడ్మాస్టర్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు మండిపడుతున్నారు. నిందితుడు దుర్గా జైశ్వాల్ తరచూ పాఠశాలలో అసభ్యకరమైన చర్యలకు పాల్పడేవాడని ఆరోపించారు. పిల్లల ముందు షర్టు తొలగించేవాడని, అతడి తీరుతో బాలికలు స్కూలుకు వెళ్లడం మానేశారని చెప్పారు.
 
తల్లిదండ్రుల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన విద్యాశాఖ దర్యాప్తు నిర్వహించి జైశ్వాల్‌ను సస్పెండ్ చేసింది. శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. అవసరమైతే హెడ్మాస్టర్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తామని బేసిక్ శిక్షా అధికారి (బీఎస్ఏ) వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం