విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థుల ముందు అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. దీంతో అతనికి తగిన శాస్తి జరిగింది. మద్యం మత్తులో విద్యార్థుల ముందు నగ్నంగా నిద్రించిన ఘటన యూపీలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బాహ్‌రైఖ్ జిల్లా విశేశ్వర్‌గంజ్ బ్లాక్‌లోని శివపూర్ బైరాగీ పాఠశాలలో ఓ హెడ్‌మాస్టర్ పూటుగా తాగిన నగ్నంగా నిద్రిస్తున్న వీడియో సోషల్ మీడియా వైరల్ అయ్యింది. తల్లిదండ్రుల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన విద్యాశాఖ దర్యాప్తు నిర్వహించి జైశ్వాల్‌ను సస్పెండ్ చేసింది.
నిందితుడు దుర్గా జైశ్వాల్ తరచూ పాఠశాలలో అసభ్యకరమైన చర్యలకు పాల్పడేవాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.