Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరో సూర్య బర్త్‌డే వేడుకల్లో విషాదం - నరాసారావుపేటలో డిగ్రీ విద్యార్థుల మృతి

Advertiesment
deadbody
తమిళ హీరో సూర్య పుట్టిన రోజు వేడుకలు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో ఓ విషాదం చోటుచేసుకుంది. తమ అభిమాన హీరో జన్మదినాన్ని పురస్కరించుకుని ఫ్లెక్సీలు కడుతుండగా, విద్యుతాఘాతానికి గురయ్యారు. దీంతో ఇద్దరు డిగ్రీ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను నక్కా వెంకటేశ్, పోలూరు సాయిగా గుర్తించారు. వీరంతా డిగ్రీ విద్యార్థులు కావడం గమనార్హం. 
 
పోలీసుల కథనం మేరకు.. నటుడు సూర్య పుట్టినరోజు సందర్భంగా మోపూరివారిపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్‌, బాపట్ల జిల్లా జే పంగలూరుకు చెందిన పోలూరి సాయి తమ స్నేహితులతో కలిసి శనివారం రాత్రి నరసరావుపేటలో ఫ్లెక్సీలు కడుతున్నారు. 
 
ఈ క్రమంలో ఫ్లెక్సీ ఇనుప ఫ్రేమ్‌ అక్కడే పైనున్న విద్యుత్‌ తీగలకు తగలడంతో ఇద్దరు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థులు పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. నరసరావుపేట గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మణిపూర్‌లో మహిళల నగ్న ప్రదర్శన : ఆరో నిందితుడు అరెస్టు