Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో ఒంటిమీదున్న బట్టలన్నీ ఇప్పేశాడు.. అదీ విమానంలో..?

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (14:13 IST)
మద్యం మత్తులో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్‌ ఏషియా విమానంలో ఓ ప్రయాణికుడు రెచ్చిపోయాడు. మద్యం మత్తులో బట్టలు విప్పేసి బీభత్సం సృష్టించాడు. సిబ్బందితో అమర్యాదగా, అసభ్యంగా ప్రవర్తించాడు.
 
తొలుత లైఫ్‌ జాకెట్ల గురించి అతగాడు సిబ్బందితో వాదనకు దిగాడు. ఆ తర్వాత రెచ్చిపోయాడు. ఉన్నట్టుండి ఒంటిమీదున్న బట్టలన్నీ ఇప్పేశాడు. అతడి చర్యతో సిబ్బంది, తోటి ప్రయాణికులు షాక్‌కి గురయ్యారు. ఏప్రిల్‌ 6న ఐ5-722 విమానంలో ఈ అవాంఛనీయ ఘటన జరిగింది.
 
ఈ ఘటనపై ఎయిర్‌ ఏషియా ఇండియా ఎయిర్‌లైన్స్‌ సంస్థ అధికార ప్రతినిధి స్పందించారు. తాగిన మత్తులో ఉన్న ప్రయాణికుడు తమ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించాడని తెలిపారు. తోటి ప్రయాణికులతో కలిసి సిబ్బంది పదేపదే విజ్ఞప్తి చేయడంతో చివరకు కూర్చున్నాడని చెప్పారు. ఆ తర్వాత దీని గురించి పైలట్లకు సమాచారం ఇచ్చారని వివరించారు.
 
జరిగిన ఘటనపై ఢిల్లీలోని ఏటీసీకి పైలెట్ సమాచారం అందించి, త్వరగా ల్యాండింగ్‌కు అనుమతించాలని కోరారని తెలిపారు. విమానం ఢిల్లీలో ల్యాండింగ్‌ కాగానే, అతడిని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి అప్పగించామన్నారు. 
 
దీనిపై ఢిల్లీ ఎయిర్‌ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశామని, అతడిపై తగు చర్యలు తీసుకోవాలని కోరామని ఎయిర్‌లైన్స్‌ అధికారులు తెలిపారు. ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం