Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో జడుసుకుంటుంటే.. కాటేసిన పామును కవర్‌లో వేసుకొచ్చాడు..

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (11:27 IST)
అసలే కరోనాతో జనాలు జడుసుకుంటుంటే.. కొందరు మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తూ.. జనాలను ఇంకా జడుసుకునేలా చేస్తున్నారు. తమిళనాడు కోయంబత్తూరులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కాటేసిన పామును ప్రాణాలతో ఆస్పత్రికి తీసుకొచ్చిన యువకుడిని చూసి వైద్యులు, సిబ్బంది దిగ్ర్భాంతి చెందారు. 
 
వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూర్‌ సింగానల్లూర్‌ కన్నిమేడు ప్రాంతానికి చెందిన సౌందర్‌రాజన్‌ పెయింటర్‌. ఆయన గురువారం రాత్రి శౌరిపాళయంలోని తన స్నేహితుడి ఇంటికి రాగా, పక్క ఇంట్లో పాము ఉన్నట్లు చుట్టుపక్కల వారు కేకలు వేశారు. మద్యం మత్తులో ఉన్న సౌందర్‌రాజన్‌ ఇంట్లోకి వెళ్లి చూసి, మూలన ఉన్న నాగుపామును పట్టుకోవడంతో అది అతని చేతిపై కాటు వేసింది.
 
పామును ఓ ప్లాస్టిక్‌ బ్యాగులో ఉంచి సౌందర్‌రాజన్‌ నేరుగా వచ్చి వైద్యసిబ్బంది బ్యాగు నుంచి పామును వెలుపలికి తీసి చూపించి మళ్లీ దానిని బ్యాగులో ఉంచి సెక్యూరిటీ గార్డుకు అందజేశాడు. గార్డ్‌ దానిని అటవీ శాఖ సిబ్బందికి అందజేశారు. సౌందర్‌రాజన్‌కు వైద్యులు చికిత్సలు అందించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments