Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందేసి చిందేసిన వరుడు.. ఛీ నాకీ పెళ్లి వద్దన్న వధువు.. ఆ తర్వాత..?

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (09:42 IST)
పెళ్లి జరుగుతోంది.. అయినా మందేసి చిందేశాడు వరుడు. అంతే వధువు ఛీ పొమ్మంది. పెళ్లి వద్దంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో సదరు మగపెళ్లివారికి దిమ్మ తిరిగిపోయింది. ఈ ఘటన యూపీలోని పీలీభీత్‌లో ఒక పెళ్లి వేడుకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షాజహాన్‌పూర్ పరిధిలోని మవియాపూర్ నుంచి మగపెళ్లివారు బిస్లండాకు మందీ మార్బలంతో వచ్చారు.
 
కరోనా నిబంధనల్ని ఉల్లంఘించి వందమందికి పైగా వచ్చారు. దీంతో ఆడపెళ్లివారు ఈ కరోనా సమయంలో నిబంధనలు ఉన్నాయి కదాని అడిగారు. దీంతో మగపెళ్లివారికి కోపం వచ్చింది. ఆడపెళ్లివారిదో గొడవకు దిగారు. అప్పటికే మద్యం తాగి డ్యాన్సులేసుకుంటూ వచ్చిన మగపెళ్లివారు మరింతగా ఆడపెళ్లివారిపై రెచ్చిపోయారు. అలా అలా గొడవ పెద్దదైంది.
 
అది ఎంత వరకూ వెళ్లిందంటే మగపెళ్ళివారు పెళ్లికుమార్తె సోదరుడు, చిన్నాన్నలను కొట్టేదాకా వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న పెళ్లికుమార్తె తనకు ఈ పెళ్లి వద్దంటూ ఖరాఖండీగా చెప్పేసింది. దీంతో వివాదం మరింత ముదరింది. ఒక ఆడదానికి ఇంత పొగరా? అని మగపెళ్లివాళ్లు మరింతగా రెచ్చిపోయారు. నానా మాటలు అన్నారు. మా పరువు పోయిందంటూ గెంతులేశారు.
 
ఇలా ఈ గొడవకాస్తా పోలీసుల వరకూ చేరింది. పోలీసులు పెళ్లి వేదిక వద్దకు వచ్చారు. ఇరు తరపు వారి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. కానీ వధువు మాత్రం ఈ పెళ్లి తనకొద్దని చెప్పేసింది. దీంతో మగపెళ్లివారికి తలకొట్టేసినట్లై.. ఏం చేయాలో తెలీక తాగిందంతా దిగిపోవడం ఇళ్లకు తిరుగుముఖం పట్టారు. ఆత్మాభిమానంతో మాట్లాడిన ఆ పెళ్లికూతురు నిర్ణయం చాలా చాలా మంచిదేనని పలువురు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ప్రదర్శించబడుతుందని ఎప్పుడూ ఊహించలేదు : రానా దగ్గుబాటి

పోసాని క్షమార్హులు కాదు... ఆయనది పగటి వేషం : నిర్మాత ఎస్కేఎన్

తండేల్ నుంచి నాగ చైతన్య, సాయి పల్లవిల బుజ్జి తల్లి రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments