Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాహంలో గొడవ - పెళ్లయిన 2 గంటలకే పెటాకులైన పెళ్లి

Advertiesment
Gorakhpur
, బుధవారం, 2 డిశెంబరు 2020 (13:53 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌లో జరిగిన ఒక వివాహ వేడుకలో గొడవ జరిగింది. ఈ గొడవ ఫలితంగా జరిగిన తంతు కేవలం 2 గంటల్లో ఈ పెళ్లి పెటాకులైంది. ఈ వివరాలను పరిశీలిస్తే, హెమ్చాపర్ గ్రామంలో ఓ వివాహ వేడుక జరిగింది. ఈ పెళ్లి తంతు ముగిసిన తర్వాత గందరగోళం చెలరేగింది. కొత్త పెళ్లికుమార్తెను అత్తారింటికి పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలో స్వల్ప అనారోగ్యంతో వరుడు స్పృహ తప్పిపడిపోయాడు. దీంతో చాలాసేపు అక్కడ డ్రామా జరిగింది. కొత్త పెళ్లి కూతురు అత్తారింటికి వెళ్లనని మొండికేసింది. 
 
జరిగిన వివాహ వేడుకలో వరుడు స్పృహ తప్పిన నేపథ్యంలో పెద్దల మధ్య రెండు గంటలపాటు పంచాయతీ జరిగింది. ఇరు వర్గాల మధ్య రాజీ కుదరకపోవడంతో ఈ వివాహాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. హెమ్చాపర్ నివాసి భుఆల్ నిషాద్ ఇంటికి హైదర్‌గంజ్ నుంచి వరునితోపాటు అతని బంధువులు వచ్చారు. వివాహ వేడుక పూర్తయ్యింది. ఇంతలో వరుడు స్పృహ తప్పి పడిపోయాడు. 
 
దీనిని గమనించిన వధువు తరపువారు వరునికి ఏదో వ్యాధి ఉన్నదంటూ పెళ్లని రద్దు చేయాలని పట్టుబట్టారు. 2 గంటలపాటు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వధువు తరపువారు తాము వరునికి ఇచ్చిన కట్నకానుకలు వెనక్కి తీసుకున్నారు. పెళ్లి క్యాన్సిన్ కావడంతో పెళ్ళికి వచ్చినవారంతా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తుఫానుగా మారిన బురేవి... 4న తీరం తాకుతుందట... కేరళలో రెడ్‌అలెర్ట్