Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాలో ఉద్యోగం.. ఏం ప్రయోజనం.. మెడికోను బర్త్ డే రోజునే పరలోకం పంపాడు..

Advertiesment
అమెరికాలో ఉద్యోగం.. ఏం ప్రయోజనం.. మెడికోను బర్త్ డే రోజునే పరలోకం పంపాడు..
, గురువారం, 26 నవంబరు 2020 (19:14 IST)
మనుషులు ఉన్నత చదువులు చదివినా మారట్లేదు. డబ్బు కోసం జనాలు ఆరాటపడుతున్నారు. ధనం కోసం ఎలాంటి స్థాయికన్నా దిగజారుతున్నారు. తాజాగా ఉన్నత చదువులు చదివి అమెరికాలో ఉద్యోగం చేసినా.. ఆ వ్యక్తికి భార్య వద్ద ఎలా ప్రవర్తించాలో తెలియలేదు. వరకట్నం కోసం ఆమెను వేధించాడు. పుట్టింటి నుంచి తెమ్మన్నాడు. అతడి వేధింపులు తాళలేక ఆ వివాహిత బిడ్డకు జన్మనిచ్చిన ఐదో నెలలోనే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఈ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. 
 
వరకట్న వేధింపులతో అనంతపురం జిల్లాలో ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. అనంతలోని హిందూపురంలో దారుణం జరిగింది. ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. మడకశిరకు చెందిన అజ్మతుల్లా, అక్తర్‌ జాన్‌ కుమార్తె అర్షియ (26)ను హిందూపురం పట్టణంలోని ఆర్టీసీ కాలనీలోని నూరుల్లాకు ఇచ్చి గత యేడాది నవంబరులో ఘనంగా వివాహం జరిపించారు పెళ్లి అయిన నెలరోజుల తరువాత భర్త యుఎస్‌ఎ వెళ్లాడు. 
 
అర్షియ ఎంబిబిఎస్‌ ఆఖరి సంవత్సరం కర్ణాటకలోని తుమకూరులో చదువుతోంది. కాని పెళైన మరుసటి రోజు నుంచే భర్త నూరుల్లా వేదింపులకు గురిచేస్తుండేవాడు. అంతేకాక యుఎస్‌ఎకు వెళ్లినా ఫోన్‌‌లో నిత్యం నరకం చూపించేవాడు. ఇంతలో అర్షియ ఇటీవలే ప్రసవించింది. దీంతో ఈ నెల 5న అర్షియను అత్తగారింటికి పంపించారు.
 
ఈ నెల 10న యుఎస్‌ఎ నుండి తన అల్లుడు నూరుల్లా హిందూపురానికి వచ్చాడు. అప్పటి నుండి అర్షియను మరింత వేధింపులకు గురిచేశాడు . ఇచ్చిన కట్నం చాలదని ఇంకా ఎక్కువ తీసుకురావాలంటూ వేధించడంతోపాటు అనుమానించేవాడు. బుధవారం అర్షియ పుట్టిన రోజు కావటంతో మంగళవారం ఆమె తల్లిదండ్రులు ఫోన్‌ చేశారు.
 
ఆసమయంలో అర్షియ తమ తల్లిదండ్రులతో సరిగా మాట్లాడలేదు. అయితే బుధవారం ఉదయం ఫోన్‌ చేసి అర్షియాకు బాగాలేదని చెప్పారు. దీంతో వారు ఇక్కడికి వచ్చి చూసేసరికి అర్షియ శవమై కనిపించింది. అత్తింటివారే హత్యచేసి ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లైన ఏడాదికే తమ బిడ్డను పొట్టన బెట్టుకున్నారని అర్షియ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తన శృంగార కోర్కె తీర్చలేదని హత్య చేసి ఆమె మృతదేహంతో ఆ పని చేసాడు