Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవాలో ఇక బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై నిషేధం.. మనోహర్ పారికర్

గోవా బీచ్‌లో మందేయాలనుకునే పర్యాటకులకు చేదువార్త. గోవాలో మితిమీరిన స్వేచ్ఛను అదుపుచేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తరచూ పర్యాటకులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యపానాన్ని నిషే

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (09:10 IST)
గోవా బీచ్‌లో మందేయాలనుకునే పర్యాటకులకు చేదువార్త. గోవాలో మితిమీరిన స్వేచ్ఛను అదుపుచేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తరచూ పర్యాటకులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యపానాన్ని నిషేధించాలని గోవా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ తెలిపారు.
 
మద్యం దుకాణాల చుట్టుపక్కల బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా తాగుతూ కనిపిస్తే ఆ దుకాణాలకు జరిమానాలు విధిస్తామని లేదా లైసెన్సులు రద్దు చేస్తామని  మనోహర్ పారికర్ హెచ్చరించారు. ఎవరైనా మద్యం తాగాలనుకుంటే బహిరంగ ప్రదేశాల్లో ఇక కుదరదని గదుల్లో, హోటల్స్, బార్లకే పరిమితం కావాల్సి వుంటుందని చెప్పుకొచ్చారు. గత ఏడాదే బీచ్‌లు, గుర్తించిన కొన్ని ప్రదేశాల్లో మద్యపానాన్ని ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. 
 
రోడ్లపక్కన కూర్చొని మద్యం తాగి, బాటిళ్లను పగలగొట్టి కొంతమంది పర్యాటకుల్లో అభద్రతా భావం సృష్టిస్తున్న కారణంతోనే నిషేధం విధిస్తున్నామని పారికర్‌ వెల్లడించారు. అయితే గోవాకు పర్యాటకులు పెద్ద ఎత్తున రావడానికి కారణం అక్కడ ఎక్కడ పడితే అక్కడ బార్లు, పబ్‌లు, మద్యం దుకాణాలు వుండటమే. ప్రస్తుతం వాటిపై నిషేధం విధించడంతో పర్యాటకులు నిరుత్సాహం చెందుతున్నారు. ఇంకా మద్యం వ్యాపారం దెబ్బతింటుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments