Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో కనిపించి మళ్లీ అదృశ్యమైన హనీప్రీత్ సింగ్.. విపాసన సంగతేంటి?

డేరా చీఫ్ రామ్ రహీమ్ సింగ్ సన్నిహితురాలు.. హనీప్రీత్ సింగ్ నేపాల్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. ఆమె సెప్టెంబర్ 2వ తేదీన కనిపించిందని పోలీసులు చెప్తున్నారు. ఆమెతో పాటు నలుగురు ఉన్నారని ఆమెను సురక్షిత ప

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (08:50 IST)
డేరా చీఫ్ రామ్ రహీమ్ సింగ్ సన్నిహితురాలు.. హనీప్రీత్ సింగ్ నేపాల్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. ఆమె సెప్టెంబర్ 2వ తేదీన కనిపించిందని పోలీసులు చెప్తున్నారు. ఆమెతో పాటు నలుగురు ఉన్నారని ఆమెను సురక్షిత ప్రదేశంలో దాచేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడైంది. హనీ ప్రీత్ సింగ్ పూర్తిగా గెటప్ మార్చుకుని ప్రైవేట్ టాక్సీలో తిరుగుతుందని సమాచారం.  
 
హర్యానా పోలీసు విభాగానికి చెందిన సిట్‌శాఖ రాజస్థాన్‌లో డేరా బాబా సన్నిహితుడైన ప్రదీప్ గోయల్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో పరారీలో ఉన్న హనీప్రీత్ సింగ్ కోసం గాలింపులు చేపట్టింది. ప్రదీప్ పోలీస్ రిమాండ్‌లో ఉన్నాడు. ప్రదీప్ హనీప్రీత్ నేపాల్ పారిపోయిందని చెప్పడంతో హర్యానా పోలీసులు కాఠ్మాండూలోని తమ సోర్స్‌తో కనెక్టయ్యారు. 
 
వీరు హనీప్రీత్ ఫొటో ఆధారంగా వివరాలు సేకరించడం ప్రారంభించారు. ఫలితంగా వారికి హనీప్రీత్ ఆచూకీ లభ్యమైంది. సెప్టెంబరు 2న హనీప్రీత్ కనిపించిందని, తరువాత తిరిగి అదృశ్యమైందని తేలింది. మరోవైపు డేరా చీఫ్‌గా జస్మీత్ పగ్గాలు చేపట్టే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. డేరా సచ్ఛా సౌధా మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్‌పర్సన్ విపాసన అదృశ్యం కావడంతో డేరాబాబా కొడుకు బాధ్యతలు అప్పగించేందుకు గుర్మీత్ ఒప్పుకొన్నారని సమాచారం.
 
డేరా మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్ పర్సన్ విపాసన శుక్రవారం నుండి డేరా సఛ్చా సౌధ ఆశ్రమం నుండి కనిపించకుండా పోయారు. ఆమె ఫోన్ కూడా కనిపించటం లేదు. దీనిపై పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం