Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

ఠాగూర్
శనివారం, 21 జూన్ 2025 (22:48 IST)
తన ప్రియురాలిని ఇంప్రెస్ చేద్దామని భావించిన ఓ ప్రియుడు చివరకు జైలుపాలై ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా, ఎంటాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, కానింగ్ ప్రాంతంలోని మలిర్‌ధర్‌కు చెందిన 20 యేళ్ల దీప్తేందు బాగ్ శుక్రవారం ఉదయం 10.15 గంటల సమయంలో ఎంటాలీ పోలీస్ స్టేషన్‌కు తన ప్రియురాలితో కలిసి వచ్చాడు. 
 
వెస్ట్ బెంగాల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అని రాసివున్న నేమ్ బ్యాడ్జీని ధరించి పోలీస్ యూనిఫామ్‌లో కనిపించాడు. స్టేషన్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి హోదాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క పోలీస్‌కు సెల్యూట్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో అతని ప్రవర్తనను ఇతర పోలీసులు పసిగట్టారు. వెంటనే ఆయన వద్ద విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
దీనిపై జాయింట్ పోలీస్ కమిషనర్ రూపేష్ కుమార్ మాట్లాడుతూ, అతను సీఐడీ యాంటీ టెర్రర్ స్క్వాడ్‌లో ఇన్‌స్పెక్టరుగా నటిస్తున్నాడు. యూనిఫాం ఎందుకు ధరించాడో సరైన కారణం చెప్పలేకపోయాడు. అంతేకాకుండా, కేవలం మూడేళ్ల సర్వీసులోనే తనకు ఇన్‌స్పెక్టరుగా ప్రమోషన్ వచ్చిందని ఎంటాలీ పోలీసులకు చెప్పడంతో మా అనుమానం మరింత బలపడింది అని వివరించారు. ప్రియురాలిని ఇంప్రెస్ చేయడానికే దీప్తేందు బాగ్ ఇలా పోలీస్ అధికారిగా నటించిన ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments