Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు స్నానం చేస్తుంటే రహస్యంగా వీడియో తీశాడు.. జైలుపాలైన టీచర్

విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ గురువు కామాంధుడిగా మారిపోయాడు. మహిళలు స్నానం చేస్తుంటే రహస్యంగా మొబైల్‌లో వీడియో తీసి జైలుపాలయ్యాడు. అతనికి న్యాయస్థానం మూడేళ్ల జైలుశిక్ష విధించింది. తమిళనా

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2016 (12:43 IST)
విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ గురువు కామాంధుడిగా మారిపోయాడు. మహిళలు స్నానం చేస్తుంటే రహస్యంగా మొబైల్‌లో వీడియో తీసి జైలుపాలయ్యాడు. అతనికి న్యాయస్థానం మూడేళ్ల జైలుశిక్ష విధించింది. తమిళనాడు కోర్టు ఇచ్చిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే... 
 
నాగపట్టణం జిల్లా కుత్తాళానికి చెందిన బాలమురుగన్ (34) మైలాడుదురైలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో డ్రాయింగ్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. దివ్యాంగుడైన బాలమురుగన్ తమ ఇంటి ముందు ఓ దుకాణాన్ని నడుపుతున్నాడు. అదేప్రాంతానికి చెందిన 35 ఏళ్ల మహిళ దుకాణానికి వచ్చే సమయంలో బాలము రుగన్ అశ్లీల పదజాలంతో మాట్లాడుతుండేవాడు. 
 
ఈ నేపథ్యంలో 2015 ఏప్రిల్‌ 3వ తేదీన ఆ మహిళ తన ఇంటి వెనుకవైపున్న పాకలో స్నానం చేస్తుండగా తాటాకుల మధ్య మొబైల్‌ ఫోన్ ఉండడాన్ని గమనించి దిగ్ర్భాంతి చెందింది. దానిని తీసి తన భర్తకు చూపించి పెరంబూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలమురుగన్‌ను నిందితుడిగా తేల్చారు. ఈ కేసును విచారించిన కార్తికేయన్ బాల మురుగన్‌కు మూడేళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమాను విధిస్తూ తీర్పు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments