Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం.. కరెంట్ షాకిచ్చి చంపేద్దామనుకున్న భర్త.. ఏం జరిగిందటే?

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (12:49 IST)
ఒక భర్త భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తన స్నేహితుడితో భార్య శారీరకంగా కలుస్తోందని అనుకున్నాడు. ఎలాగైనా తన భార్యను, అతని ప్రియుడ్ని చంపేయాలని ప్లాన్ చేశాడు. చివరకు వారు తప్ప అభంశుభం తెలియని వారు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పశ్చిమబెంగాల్ లోని దక్షిణ పరిగణాల జిల్లాలో జరిగిన సంఘటన సంచలనం రేపుతోంది.
 
భవన కార్మికుడుగా పనిచేస్తున్న ఒక వ్యక్తి తన బంధువులతో కలిసి నివాసముంటున్నాడు. అతని కుటుంబంతో పాటు అతని బంధువులు కూడా కలిసి ఉంటున్నారు. అయితే గత నెలరోజుల నుంచి తన భార్య.. తన స్నేహితుడు.. బంధువుతో కలిసి ఉందని అనుమానం పెంచుకున్నాడు.
 
భార్యకు చాలాసార్లు చెప్పాడు. అయితే అదంతా లేదని ఆమె చెప్పింది. అయినా సరే ఒప్పుకోలేదు. ఎలాగైనా తన భార్యను, ప్రియుడిని చంపేయాలని ప్లాన్ చేశాడు. ఇంటి ముందున్న కరెంటు వైర్లను తెంచి వదిలేశాడు. తాను బయటకు వెళ్లి బట్టలను తగులబెట్టి ఇళ్ళు తగలబడిపోతోందని గట్టిగా అరిచాడు. 
 
ఇంట్లోని వారందరూ ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. దీంతో బంధువులు ముగ్గురు విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అతని భార్య, ప్రియుడు మాత్రం సేఫ్‌గా ఉన్నారు. గ్రామస్తులు విషయం తెలుసుకుని భవన కార్మికుడిని చితకబాదారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments