Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో డీఎంకే ఎంపీ కుమారుడు దుర్మరణం

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (12:32 IST)
తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అధికార డీఎంకేకు చెందిన రాజ్యసభ సభ్యుడు ఎన్.ఆర్. ఇళంగోవన్ కుమారుడు రాకేష్ (22)తో పాటు మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. వీరిద్దరూ పుదుచ్చేరి నుంచి చెన్నైకు వెళుతుండగా, గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. అమిత వేగంతో వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌‍ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాకేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆయనతో కలిసి ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని క్రేన్ సాయంతో కారును పక్కకు తొలగించి వాహనరాకపోకలను పునరుద్ధరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇళంగోవన్ రాజ్యసభలో డీఎంకే తరపున గత 2020 నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments