Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో పూజారులుగా ఎస్సీలు - ఎంబీసీలు : సీఎం స్టాలిన్

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (16:44 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఆలయాల్లో పూజలు చేసేందుకు వీలుగా బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమించారు. 
 
ఇప్పటికేవరకు బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైన దేవాలయాల్లో అర్చకత్వం ఇప్పుడు బ్రాహ్మణేతరులకు కూడా అనుమతినిస్తూ సీఎం స్టాలిన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
ఇందుకోసం సుశిక్షితులైన 24 మంది బ్రాహ్మణేతరులను పలు పుణ్యక్షేత్రాల్లో అర్చకులుగా నియమించింది. వీరిలో ఐదుగురు షెడ్యూల్ కులాలకు చెందిన వారు కాగా, మరో ఆరుగురు ఎంబీసీలు, 12 మంది బీసీలు, ఓసీ వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నారు. 
 
వీరితో పాటు మరో 138 మందిని ఆలయాల్లో పని చేయడానికి నియమించారు. వీరందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేయబోతున్నారు. గత మే నెలలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన స్టాలిన్ వంద రోజుల పాలనతో అన్ని వర్గాల ప్రజలతో శభాష్ అనిపించుకుంటున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments