Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివసేనలోని చెత్త అంతా బయటకు వెళ్లిపోయింది : ఆదిత్య ఠాక్రే

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (09:44 IST)
మహారాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ సంక్షోభంపై ఆ రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే స్పందించారు. పార్టీలోని చెత్త అంతా బయటకు వెళ్లిపోయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. 
 
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంపై ఆ రాష్ట్ర మంత్రి, రెబెల్ నేత ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో 40 మంది వరకు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. వీరంతా గౌహతిలోని ఓ క్యాంపులో బస చేస్తున్నారు. 
 
ఈ పరిస్థితులపై ఆయన స్పందిస్తూ, అస్సాం రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తుంటే అక్కడికి వెళ్లిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు లగ్జరీ హోటల్‌లో ఎంజాయ్ చేస్తున్నారన్నారు. గౌహతిలో తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఒక్క రోజు భోజనం ఖర్చు రూ.9 లక్షలు అవుతుందన్నారు. 
 
అలాగే, గుజరాత్ నుంచి ప్రైవేట్ విమానాల్లో గౌహతికి చేరుకున్నందుకు వారు సిగ్గుపడాలన్నారు. పైగా, షిండేకు ముఖ్యమంత్రి పదవిని కూడా ఉద్ధవ్ ఆఫర్ చేశారని, కానీ, ఆయన తిరస్కరించారని ఆదిత్య ఠాక్రే చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments