Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

ఠాగూర్
మంగళవారం, 1 జులై 2025 (14:30 IST)
కొత్త జీవితాన్ని కొనసాగించేందుకు వచ్చే దేశం విడిచి మరో దేశంలోకి అడుగుపెట్టిన ఓ ప్రేమజంట కథ విషాదాంతమైంది. రాజస్థాన్ రాష్ట్రంలోని థార్ ఎడారిలో కఠిన వాతావరణ పరిస్థితులు, మండుతున్న ఎండలను తట్టుకోలేక దాహంతో ఓ ప్రేమజంట ప్రాణాలు విడిచింది. అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 11 కిలోమీటర్ల దూరంలో వారి మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది.
 
పూర్తి వివరాల్లోకి వెళితే... రాజస్థాన్‌ రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతంలో శనివారం ఓ స్థానిక పశువుల కాపరి రెండు మృతదేహాలను గుర్తించి, వెంటనే సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్ఎఫ్) సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, మృతులు పాకిస్థానీ జాతీయులుగా గుర్తించారు. వారి వద్ద లభించిన ఓటరు గుర్తింపు కార్డుల ఆధారంగా, మృతులను పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన రవి కుమార్ (17), శాంతి బాయి (15)గా గుర్తించారు. వారి వద్ద పాకిస్థాన్‌కు చెందిన మొబైల్ సిమ్ కార్డు కూడా దొరికింది.
 
మృతదేహాలు పూర్తిగా నల్లగా మారిపోయి ఉండటం, యువకుడి నోటి వద్ద ఓ వాటర్ క్యాన్ పడి ఉండటంతో.. వారు దాహం తట్టుకోలేక, తీవ్రమైన డీహైడ్రేషన్‌తో మరణించి ఉంటారని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. పాకిస్థాన్‌లోని తమ ఇంటి నుంచి బయలుదేరిన ఈ జంట, కాలినడకన అక్రమంగా సరిహద్దు దాటే ప్రయత్నంలో ఎడారిలో దారి తప్పిపోయి ఉంటుందని భావిస్తున్నారు. యువతి చేతులకు కొత్త పెళ్లికూతురు ధరించే విధంగా ఎరుపు, తెలుపు గాజులు ఉండటం అందరినీ కలచివేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments