Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపాల చిట్టాగా డేరా బాబా ఆశ్రమం.. లొంగదీసుకుంటాడు.. అబార్షన్ చేయిస్తాడు..

డేరా బాబా పాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గుర్మీత్ సింగ్ ఆశ్రమంలో జరిపిన సోదాల్లో బాబా క్రూరమృగాలను పెంచుతున్నట్లు అధికారులు గుర్తించారు. తనపై తీర్పు వెలువడానితి రెండు వారాల ముందే గుర్మీత్

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (17:52 IST)
డేరా బాబా పాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గుర్మీత్ సింగ్ ఆశ్రమంలో జరిపిన సోదాల్లో బాబా క్రూరమృగాలను పెంచుతున్నట్లు అధికారులు గుర్తించారు. తనపై తీర్పు వెలువడానితి రెండు వారాల ముందే గుర్మీత్ అటు సన్నిహితులతో కలిసి హర్యానా, ఢిల్లీల్లో విధ్వంసానికి పథకం రచించినట్లు అధికారులు గుర్తించారు. అబార్షన్ సెంటర్లు, క్రూర మృగాలను సీజ్ చేసినట్లు అధికార బృందం తెలిపింది. 
 
ప్లాస్టిక్‌ కరెన్సీ, ప్రపంచ వింతల నమూనాలు, సినిమా షూటింగ్‌ కోసం ప్రత్యేక సెట్‌లు, ప్రత్యేక ఆయుధ కారాగారం, ఇలా అన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా సాధ్వీలను కలవడానికి ప్రత్యేంగా అండర్‌గ్రౌండ్‌లో ఏకంగా 5కిలోమీటర్ల రహస్య మార్గాన్ని నిర్మించాడు. ఆశ్రమంలో ప్రత్యేక అబార్షన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశాడు. సాధ్వీలను లొంగతీసుకోవడం, లొంగని వారిని చంపేయడం మామూలేనని శిష్యులు చెప్తున్నారు. గర్భం ధరిస్తే అబార్షన్ చేయడానికి ప్రత్యేక సెంటర్లు కూడా ఏర్పాటు చేశాడు.
 
డేరా బాబా ఆశ్రమంలో ఎక్కడా టీవీలు కనిపించవు. పెద్ద పెద్ద స్ర్కీన్లు మాత్రం అమర్చి ఉంటాయి. ఈ స్ర్కీన్ల మీద గురూజీ గురించి మాత్రమే చూపిస్తుంటారు. దశావతారాలు ఎత్తిన విష్ణువుతో గురూజీని పోలుస్తూ కథలు, కథనాలు ప్రసారం అవుతూ ఉంటాయి. ఆయన్నొక సాధువుగా, దాతగా, క్రీడాకారునిగా, నటునిగా, గాయకునిగా, చలన చిత్ర దర్శకునిగా, రచయితగా, గేయ రచయితగా, దేవదూతగా రకరకాల అవతారాలలో ప్రదర్శిస్తుంటారని డేరా బాబా శిష్యులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments