Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేరా బాబా ఆ పని చేసేవాడు... శవాలను పాతిపెట్టి, మొక్కలు నాటేవాడు..

డేరా బాబాకు చెందిన నేరాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. భక్తుల నమ్మకాన్ని బాగా వాడుకున్న డేరా బాబా వారిని చంపి అవయవాలను అమ్మేసేవాడని టాక్ వస్తోంది. ఈ విషయాన్ని బాబా మాజీ భక్తు డు గురుదాస్‌ తూర్‌ తెలిపాడు. ప్రైవేట్ వైద్య శాలలకు మృత దేహాలను విక్రయ

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (05:50 IST)
డేరా బాబాకు చెందిన నేరాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. భక్తుల నమ్మకాన్ని బాగా వాడుకున్న డేరా బాబా వారిని చంపి అవయవాలను అమ్మేసేవాడని టాక్ వస్తోంది. ఈ విషయాన్ని బాబా మాజీ భక్తు డు గురుదాస్‌ తూర్‌ తెలిపాడు. ప్రైవేట్ వైద్య శాలలకు మృత దేహాలను విక్రయించే వాడని అతడు చెప్పాడు. లఖ్‌నవ్‌లోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలకు డేరా బాబా 14 మృతదేహాలను విక్రయించాడన్న ఆరోపణలపై హరియాణా సర్కారు శుక్రవారం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో అవయవాల కోసం హతమార్చిన వారిని డేరాలోనే పాతిపెట్టి... వారి శవాలపై గుర్తుకోసం మొక్కలు నాటేవారని తూర్ షాకింగ్ నిజాలను తెలిపాడు. 
 
డేరాలో చేరిన వెంటనే తమ అవయవాలను స్వచ్ఛందంగా దానం చేస్తామంటూ భక్తుల నుంచి స్వీయ ధ్రువీకరణలను తీసుకునేవారని, తర్వాత భక్తులను హతమార్చి వారి అవయవాలను అమ్ముకునేవారని గురుదాస్‌ తెలిపారు. హర్యానా, పంజాబ్‌ల్లోని ప్రైవేటు వైద్య కళాశాలలకు మృత దేహాలను బాబా విక్రయించేవాడని గురుదాస్‌ చెప్పారు.ఇందులో వైద్యుల ప్రమేయం కూడా వుందని తూర్ చెప్పుకొచ్చాడు. 
 
డేరాను నమ్మి రూ.3 కోట్లు పెట్టుబడి పెట్టిన రైతు... బాబా జైలు కెళ్లడంతో ఆత్మహత్య చేసుకున్నాడని గురుదాస్ తూర్ తెలిపాడు. హర్యానాలోని బల్‌కారా గ్రామానికి చెందిన సోంబిర్‌ కుమార్‌(47) డేరాబాబాకు చెందిన ఎంఎస్‌జీ రిసార్ట్స్‌లో రూ.3 కోట్లు పెట్టుబడి పెట్టాడు. దీని కోసం తన 32 ఎకరాలు అమ్మేశాడు. బాబా జైలుకెళ్లడంతో సోంబిర్ తన పెట్టుబడి వృధా అయ్యిందనే నిరాశతో ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments